qkg:contextText
|
వారణాసిలో విద్యార్థిగా ఉన్న సమయంలో, దైవధ్యానంలో ఉండిన వాత్సాయనుడు, బభర్వ్యుడు మరియు ఇతర ప్రాచీన గ్రంథకర్తల రచనలని చదివి, వారు తెలిపిన నీతినియమాల గురించి ఆలోచించిన తర్వాత పవిత్ర శాసనము యొక్క భావనలతో, లోక కళ్యాణమునకై ఈ సంకలనమును చేసెను. కేవలము కామాన్ని తీర్చుకొనేందుకు మాత్రమే ఈ గ్రంథముని పరికరముగా ఉపయోగించుకొనరాదు. శాస్త్ర పరిజ్ఞానము కలిగిన, ధర్మార్థకామాల గురించి ఎరిగినవాడు, లౌకిక ఆచారాలపై అవగాహన ఉన్నవాడు, ఇంద్రియ నిగ్రహమును తప్పక పొందుతాడు. క్లుప్తంగా చెప్పాలంటే ధర్మార్థకామాలని ఎరిగిన తెలివైనవాడు కోరికలకి బానిసవ్వక చేపట్టిన కార్యాలన్నింటిలోనూ సఫలీకృతుడౌతాడు. (te) |