so:text
|
ఎప్పుడైతే నువ్వు వేగంగా పోరాడితే జీవించి లేకుంటే మరణిస్తావో దాన్ని మృత్యురంగం అంటారు. వారిని పారిపోవడానికి దారిలేని, ఆ ప్రయత్నం చేస్తే ముందుగానే మరణించే ప్రదేశంలో నిలబెట్టు. అక్కడ మరణించబోతారని తెలిస్తే, వారు చేయలేనిదేముంటుంది? యోధులు వారి పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారు. యోధులు గొప్ప ప్రమాదంలో వున్నప్పుడు వారికి భయం ఉండదు. వారు ఎక్కడికీ పోయేందుకు దారి లేదంటే వారు దృఢంగా తయారవుతారు. వారు రంగంలోకి పూర్తిగా దిగినప్పుడు, పోరాటానికి నిబద్ధులై ఉంటారు. వారికి మరే అవకాశమూ లేకపోతే వారు పోరాడతారు. (te) |