so:text
|
కానీ ఈ పద్ధతి సరియైనది కాదు. కామము గురించి, కామశాస్త్రపు ఆచారాల గురించి, కామసూత్రాల ఆచారాల గురించి స్త్రీలకి ఇప్పటికే తెలుసు. ఏ రంగం లోనైనా శాస్త్రోక్త పద్ధతులు కొందరికి మాత్రమే తెలియును. యజ్ఞం చేయువారికి వ్యాకరణము గానీ, అక్షరదోషముల గురించిగానీ తెలియకనే దేవతలని సంబోధిస్తున్నారు. జ్యోతిష్శాస్త్రము తెలియకనే సగటు మనిషి తన పనులకి మీనమేషాలని లెక్కపెడుతున్నాడు. పశు శిక్షణ గురించి తెలియకుండానే సైనికులు కేవలం సాధన ద్వారానే గజారోహణం, అశ్వారోహణం వంటివి చేస్తున్నారు. సుదూర ప్రాంత్రాలలో ఉన్న ప్రజలు కేవలం రాజు తమని రక్షిస్తాడనే నమ్మకముతోనే, మరే ఆలోచనలు లేకుండా, రాజాజ్ఞలని శిరసావహిస్తున్నారు. కేవలం స్వీయానుభవంతోనే కామ శాస్త్రం గురించి తెలుసుకొన్న కాంతలని రాకుమారీలు, మంత్రుల పుత్రికలు మరియు ఇతర సాధారణ స్త్రీలలో మనము చూడవచ్చును. (te) |